Harish Rao: మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు లేవు.. ఇక మహిళల హక్కులు ఎలా? హరీశ్ రావు

by Ramesh Naini |

మహిళా కమిషన్ సభ్యులకు గత ఏడాది కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని తాజాగా తన దృష్టికి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Harish Rao: మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు లేవు.. ఇక మహిళల హక్కులు ఎలా? హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. మహిళల హక్కులను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ సభ్యుల (women's commission members) కు గత ఏడాది కాలం నుంచి (Revanth Reddy) రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని తాజాగా తన దృష్టికి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి నెలా మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు (salaries) జీతాలు చెల్లిస్తున్నామన్న సీఎం, మంత్రుల మాటలు నేతి బీరకాయలో నెయ్యిచందంగా మారాయని అనేక సార్లు రుజువయ్యాయని విమర్శించారు. ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో మహిళా కమిషన్‌కు రూ. 2 కోట్ల 42 లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ.. విడుదల చేసింది 20 లక్షల రూపాయలకు మించి లేదని స్పష్టం చేశారు. న్యాయమూర్తులతో సమానంగా వ్యవహరించబడే మహిళా కమిషన్ సభ్యులకే జీతాలు చెల్లించలేక పోతే ఈ ప్రభుత్వం సామాన్య మహిళల హక్కులను ఏ విధంగా కాపాడుతుంది? అని ప్రశ్నించారు. వెంటనే మహిళా కమిషన్ సభ్యుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనీ, ఇక నుంచి మొదటి తారీఖునే మహిళా కమిషన్ సభ్యులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు.

Next Story