Harish Rao: సాక్షాత్తు CM ఇలాకాలో ఇలాంటి పరిస్థితా

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు.

Harish Rao: సాక్షాత్తు CM ఇలాకాలో ఇలాంటి పరిస్థితా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రొడ్డెక్కే పరిస్థితి నెలకొంది. సీఎం నియోజకవర్గానికే దిక్కులేదంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుంది’’ అని హరీష్ రావు విమర్శించారు.

ఇదిలా ఉండగా.. నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం బాగాలేదని బుధవారం రోడ్డెక్కారు. ఇటీవల భోజనాలు బాగుండటం లేదంటూ విద్యార్థులంతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు కూడా ఈ విషయాన్ని పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక మంగళవారం మధ్యాహ్న భోజనం పాఠశాలలో వడ్డించకపోవడంతో విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాల ఎదుట రోడ్డు నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఎంఈవో విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి తదనుగుణంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Harish Rao: సాక్షాత్తు CM ఇలాకాలో ఇలాంటి పరిస్థితా

Next Story