- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రైతులు నేరస్తులా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు
కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో (Urea) యూరియా కోసం రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా వీడియోలను పోస్ట్ చేశారు. భూమి కోసం పోరాడిన లగ చర్ల దళిత, గిరిజన, బలహీనవర్గాల రైతుల పై అక్రమ కేసులు బనాయించి సంకెళ్లు వేశారని ఆరోపించారు. నేడు బస్తా యూరియా కోసం పోలాలు వదిలి పోలీస్ స్టేషన్లకు వెళ్లి పడిగాపులు కాసే దుస్థితిని రైతన్నకు తెచ్చారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరస్తులా? అని ప్రశ్నించారు. నీ చేతగాని పాలనతో రైతులను అరిగోస పెడుతున్నావని సీఎంను నిలదీశారు. అన్నదాతలను నడిరోడ్డుకు ఈడ్చి వికృతానందం పొందుతున్నావు.. రైతులను పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎరువులు పంపిణీ చేసే పరిస్థితులు తెచ్చిన నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని విమర్శించారు.
రైతులను నేరస్తులుగా పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టిన నీ దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోందని, తగిన సమయంలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. కాగా, తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో రైతులను కట్టడి చేయలేక, పోలీస్ స్టేషన్‌లో యూరియా టోకెన్లు సొసైటీ సిబ్బంది పంపిణీ చేసింది. కొందరికి మాత్రమే యూరియా టోకెన్లు సిబ్బంది పంపిణీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వాతావరణం నెలకొంది.






