- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలం: హరీశ్ రావు
అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను బీజేపీ పూర్తిగా విస్మరించిందని.. రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని.. జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసిందని అన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. సంగమేశ్వర పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందన్నారు.
బసవేశ్వర ప్రాజెక్టు పూర్తికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. తాగు, సాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఉన్నపుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావడం లేదని నిలదీశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరుగగా.. మాజీ ఎంపీటీసీ దేశీటి పటేల్, రవికుమార్, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు తదితరులు జాయిన్ అయ్యారు.






