- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూటపూటకు IAS, IPSల బదిలీలేంటి?.. సీఎంపై హరీస్ రావు విమర్శలు
సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు. అధికారుల తరచు బదిలీలు, రాజ్యసభ ఎన్నికల గురించి స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‍లను పూట పూటకు మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు టి.హరీశ్ రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన రావడం లేదన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులను పదే పదే మారుస్తున్నారని ఇప్పటి వరకు ఐదు సార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని విమర్శించారు. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలాకుతలం, అవినీతి మయం అయిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారని విమర్శించారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందన్నారు.
పాలన జోక్‍గా మారుతోంది:
ఇధికారులను ఇలా తరచూ మారిస్తే పాలన ఎలా నడుస్తుంది ఇదంతా ఓ జోక్‍గా మారిపోయిందని విమర్శించారు. కలెక్టర్‍కు జిల్లా పై అవగాహనా రావడానికే ఆరునెలల సమయం పడుతుందని అలాంటిది ఆరునెలలలోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారన్నారు. నిత్యం బదిలీల వల్ల యువ కలెక్టర్లలో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని వాళ్లకు నచ్చిన వాళ్లకు మంచి పోస్టింగ్‍లు నచ్చని వారికి బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం, మంత్రులకు నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడిగింపు సాధారణం అయిపోయిందన్నారు. డజన్ మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇచ్చారని, వందల మంది ఇంజినీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయంలో అధికారుల పదవీ కాలం పొడగింపుపై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు.
ఆ వివరాలు భయట పెడుతా:
యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని వీటన్నిటి వివరాలు త్వరలో బయట పెడతానని హరీశ్ రావు అన్నారు. ఇంజినీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని ఆరోపించారు. అధికార్లను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదనిగతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కలెక్టర్లకు కనీసం రేండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయని కేసీఆర్ హయంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి పని చేయించారన్నారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదని తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బెదిరిస్తూ బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలన్నారు.
ఐటీ కార్యదర్శిగా సీఎస్ ఎలా?
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారని ఆరోపించారు. ఐటీ కార్యదర్శిగా సీఎస్ ఎలా పని చేయగలుతారు? సీఎస్ కు బోలెడన్నీ బాధ్యతలు ఉంటాయి. అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. 20 శాతం జీవోలు ఆన్‍లైన్‍లో ఉంచుతూ 80 శాతం ఆఫ్ లైన్‍లో ఉంచుతున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశించినా జీవోలు ఆన్‍లైన్‍లో పెట్టడం లేదని విమర్శించారు. మా సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని లేదంటే అది వారి ఖర్మ అన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైందని విమర్శించారు.
కౌన్సిలర్లకు ఓ నీతి? ఎమ్మెల్యేలకు మరో నీతా?
ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్లకు ఓ నీతి? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో నీతా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం అంతా జోక్ అయిపోయిందని అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అసెంబ్లీ అసెంబ్లీ లా లేదని హౌజ్ కమిటీలు వేయడం లేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదు. చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉంది.. ఇలా ఎపుడు జరగలేదన్నారు. అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మేనల్లుడి అక్రమ మైనింగ్:
రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్‍లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని మొబైల్ క్రషింగ్ ప్లాంట్‍కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్‍లో పెట్టారని ఆరోపించారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని లెటర్‍లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందన్నారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని అక్కడ రెడీమిక్స్ కు పర్మిషన్ లేదన్నారు. పటాన్‍చెరు ఎమ్మెల్యేకు, మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారు. ఓఆర్ఆర్‍కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉందన్నారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్‍లో మైనింగ్ దందా నడుపుతున్నదని ఆరోపించారు. రేపు నిజానిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం వెళ్తుందన్నారు.
రాజ్యసభ పోటీపై రేపటి వరకు చూద్దాం:
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి రేపటి వరకు వేచి చూద్దామన్నారు. నేను మంత్రిగా వున్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చానని జర్నలిస్టులకు పెట్టిన 16 కోట్ల బడ్జెట్ కు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఎడ్యుకేషన్ పాలసీ బాగుంటే వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదన్నారు.






