- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గం అన్నారు. ఇష్టారీతిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ (Triple R Alignment) మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు ఇవాళ హరీశ్ రావును కలిసి తమ ఆవేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చిన ఆయన.. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.
అష్టవంకర్లతో పొలాల మాయంకు కుట్ర:
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల రైతన్న నోట్లో మట్టి కొడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. నార్త్ అలైన్మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్న గూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఈ గ్రామాల్లో ఎక్కువగా నివస్తిస్తున్నది ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులేనన్నారు. అలైన్ మెంటు మార్పుతో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు భూములు కోల్పోకుండా మొదటగా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి మాత్రం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్ ఆర్ మార్గాన్ని అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
సొంత భూముల కోసమే:
సొంత భూములకు మేలు కలిగేలా ముఖ్యమంత్రి అలైన్మెంట్ ను అడ్డగోలుగా మార్చడం దుర్మార్గం అని గంగారం, శివన్న గూడెం గ్రామంలోని పూర్తి భూమి కోల్పోయి గ్రామం మొత్తం నిర్వాసితులు అవుతున్నారు. ఇంతమంది రైతుల ఆవేదన రేవంత్ రెడ్డికి అర్థం అవడం లేదా అని ప్రశ్నించారు. ఒక ఊరికి ఊరే పూర్తిగా నీ ధన దాహానికి బలైతుంటే కనీసం నీకు దయలేదా రేవంత్ రెడ్డీ? అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడ కూడా నష్టపోకుండా కేవలం రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నాయకుల భూములను కాపాడుతోందన్నారు. ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదని ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా అలైన్మెంట్ ని మారుస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు బదులుగా 28 కిలోమీటర్లకు కుదించడానికి నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం తన ఇంటి వ్యవహారం కాదని రాష్ట్రం, రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టే చర్యలు ఆపక పోతే బీఆర్ ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.






