SLBC ప్రమాదానికి 50 రోజులు.. హెలికాప్టర్ లో వెళ్లిరావడం తప్ప ఒక్కరిని కాపాడలేకపోయారు: హరీశ్ రావు

by Prasad Jukanti |

ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటనపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

SLBC ప్రమాదానికి 50 రోజులు.. హెలికాప్టర్ లో వెళ్లిరావడం తప్ప ఒక్కరిని కాపాడలేకపోయారు: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద (SLBC Tunnel Accident) ఘటనకు 50 రోజులు పూర్తి అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో (Rescue Operation) పురోగతి లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. రేవత్ సర్కార్ నిర్లక్ష్యంతో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రమాదంలో చిక్కుకున్న తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకుని టన్నెల్ వద్దనే ఉండి రోదిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదనే అవుతున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఇద్దరు మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హెలికాప్టర్‌లో వెళ్లి వచ్చారే తప్ప..

పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్లిరావడం, ఒక సారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప ఇప్పటివరకు ఒక్కరినీ ప్రాణాలతో బయటకు తెచ్చిందని లేదన్నారు. నిర్ణయాలు తీసుకవడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.

Next Story