- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: కేసీఆర్ ది సాగు భాష.. రేవంత్ రెడ్డిది చావు భాష: హరీశ్ రావు
హెచ్ సీయూ విధ్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవన్నది ప్రజలకు అర్థమైందని ఈ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోందని చెప్పారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం గణేశ్ గడ్డ సిద్ధివినాయక ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణను పడగొట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ (KCR) ఎప్పుడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు నీళ్లు అందించాలని మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా, చంపుతానని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అని దుయ్యబట్టారు.
మూసీ పేరుతో మూడు నెళ్లు, హైడ్రా పేరుతో ఆర్నెళ్లు..
రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం అని హరీశ్ రావు విమర్శించారు. మూసీ అని మూడు నెలలు, హైడ్రా అని ఆర్నెళ్లు ఉరికి ఉరికి బొక్కబోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ పెరిగితే రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిపోయిందన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలకు కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నదని ధ్వజమెత్తారు. వానకాలం రైతుబంధు 9,000 కోట్లు యాసంగి రైతుబంధు 5,000 కోట్లు. రెండు కలిపితే 14వేల కోట్లను రైతుబంధు కింద ఎగ్గొట్టారని ఇంకా 50 శాతం రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల హామీ ఇవ్వకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు తులం బంగారం పూసే లేదన్నారు.
సీఎం క్షమాపణలు చెప్పాలి
ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారట ఉపముఖ్యమంత్రి హెచ్ సీయూ విద్యార్థులపై (HCU) కేసులు ఉపసంహరించుకుంటారంట. అంటే రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెప్పినట్టే కదా అని హరీశ్ రావు నిలదీశారు. హోంశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి కేసులు పెడితే ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటామని ప్రకటిస్తున్నారు ఇదేమి రాజ్యం అని నిలదీశారు. తోక కుక్క నాడిస్తున్నదా? కుక్క తోక నాడిస్తున్నదా అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయిందని హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీలో బీసి సభకు రాహుల్ గాంధీని తీసుకొని వస్తా పార్లమెంట్లో బిల్లు ఆమోదింప చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా ఆ ధర్నాకు రాలేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రితో ఫోటోలు దిగారన్నారు.






