- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రాహుల్ గాంధీ ట్వీట్ కు హరీశ్ రావు కౌంటర్
రాహుల్ గాంధీ ట్వీట్ కు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తన బావ రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేయడంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్వీట్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రియాక్ట్ అయ్యారు. ఇది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై మీరు స్పందిస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకీయాలు, అబద్ధాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే మాత్రం మీరు మౌనంగా ఉంటున్నారు. ఇంది వంచనకు పరాకాష్ట అని విమర్శించారు. రాహుల్ గాంధీ ట్వీట్ కు ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు పై విధంగా రియాక్ట్ అయ్యారు. కాగా వాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలుపై ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తన బావను వెంటాడుతోందని మండిపడ్డారు. తాజాగా నమోదైన చార్జీషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. దురుద్దేశం, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని నిజం ఎప్పటికైనా బయటపడుతుందని పేర్కొన్నారు.






