- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా, గోదావరిపై ప్రజెంటేషన్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కృష్ణా, గోదావరిపై ప్రజెంటేషన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా, గోదావరిపై ప్రజెంటేషన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని ఎద్దేవా చేశారు. బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైందన్నారు. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కసబ్ తో పోల్చుతావా? అని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి నీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్ తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని మండిపడ్డారు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడినవు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? అని ప్రశ్నించారు. కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతదని వ్యాఖ్యానించారు.
కృష్ణాలో 763 టిఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టిఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్దాలాడావన్నారు. కేసీఆర్ 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారు? అని ప్రశ్నించారు. కొత్తగా 71శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినవు, ఆనాడే కేసీఆర్ 811 టిఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా?అని ప్రశ్నించారు. కేంద్రం స్పందిస్తే సుప్రీంకు ఎందుకు వెళ్తారు? అని అడిగారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు? రెండు అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు? అపెక్స్ లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా కళ్లు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు. ముందు నుంచి చదువుకుంటవో, వెనుక నుంచి చదువుకుంటవో, అడ్డంగా చదువుకుంటవో, నిలువుగా చదువుకుంటవో, చిన్నప్పుడు చదివినట్లు చదువుకుంటువో నీ ఇష్టం ఉన్నట్లు చదువుకో అంటూ ఎద్దేవా చేశారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున: పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామి మేరకు కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా? అని ప్రశ్నించారు. ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు? అని అడిగారు.
తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున: పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్నానంతో మాట్లాడావని అన్నారు. తుంగభద్ర అనే నది ఉందని నీకు తెలుసా.. ఆ నది ద్వారా 450-600 టిఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె అంటూ ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది? అని ప్రశ్నించారు. అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా? అని అన్నారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసని, ఇంక దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగం అయిపోరా? అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీలో ప్రబుద్దుడు ఒకడు కేసులు వేసిండు అన్నవు, ఆ ప్రబుద్దుడిని పురమాయించింది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అని మండిపడ్డారు. అయినా పాలమూరుకు 90 టీఎంసీలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బిఆర్ఎస్, కేసీఆర్ లేనని చెప్పారు. మీరు వచ్చిన రెండేళ్ల ఒక నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు, డిపీఆర్ వెనక్కి వచ్చేలా చేసారని.. ఇదీ నీ సమర్థత, నీ గొప్పతనం అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.






