- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అవ్వలేదేమో: హరీష్ రావు
ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్డీఏఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలా రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించారని అన్నారు. ఉత్తమ్ మాటల్లో కొత్త సంగతి లేదని విమర్శించారు. ఆయన ప్రెస్ మీట్ జర్నలిస్టులకు కూడా పరీక్ష పెట్టినట్టు ఉందన్నారు. తీరా చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో అనిపించిందన్నారు. డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిందని చెప్పారని అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని హరీష్ రావు చెప్పారు.
ఆనాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లు బైబిల్ కురాన్ భగవత్ గీత అని ప్రవచనాలు ఇస్తున్నారని విమర్శించారు. ఆనాడు రాంగ్ అయిన బిల్లు ఈరోజు కరెక్ట్ ఎలా అయ్యిందో ఉత్తమ్ చెప్పాలన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టులో అవినీతి జరిగినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు కలిగించినా బీఆర్ఎస్ సభ సక్సెస్ అయిందని చెప్పారు. సభకు జనాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాలేశ్వరం, మేడిగడ్డ ఘటనలు జరిగిన రోజు తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు.
కానీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూరేలా మేడిగడ్డ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చారని అన్నారు. ఎన్డీఎస్ఏ వాళ్లు కడుతున్న పోలవరంలో డయాఫారంలు కొట్టుకుపోయాయని కానీ నాలుగైదు సంవత్సరాలు అయినా ఎందుకు రిపోర్టు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ హయాంలో కట్టిన పోలవరం కప్పకూలినా ఎందుకు అక్కడకు వెళ్లలేదని విమర్శించారు. కాలేశ్వరంపై ఒక్కో ఎన్నిక వచ్చినప్పుడు ఒక్కో రిపోర్టు ఇస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కాలేశ్వరం డిజాస్టర్ అంటున్నారని ఎస్ఎల్‌బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముంటుందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక సుంకిశాలతో పాటూ చాలా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని విమర్శించారు.






