- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లు ఆపుతున్నరు: హరీష్ రావు
కాళేశ్వరం కుంగిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లను ఆపుతున్నారని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం కుంగిపోయిందని ఊరికే బద్నాం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లను ఆపుతున్నారని విమర్శించారు. వర్షాలకు గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని అన్నారు. మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక్ సాగర్ నిండిపోతుందని చెప్పారు. మేడిగడ్డ కూలితే మోటార్లు, లారీలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు.
రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగం కావా? అని ప్రశ్నించారు. ఇవేం చూడకుండా కాళేశ్వరం కూలిపోతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే మీరేం చూశారో.. మేమేం చేశామో మాట్లాడుకుందామని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. రెండు పిల్లర్లకు మరమ్మత్తులు చేస్తే ఆరు నెలల్లో నీళ్లు ఇవ్వొచ్చన్నారు. తాము ప్రశ్నిస్తేనే కల్వకుర్తి మోటార్లు స్విచ్ ఆన్ చేశారని చెప్పారు.






