ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్.. మీపై రాహుల్, ఖర్గేలకే నమ్మకం లేదు..హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు..

ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్.. మీపై రాహుల్, ఖర్గేలకే నమ్మకం లేదు..హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదు, మాకు బీసీ కన్న బిహారే ముఖ్యమని ఖర్గే రాలేదని విమర్శించారు. మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యిందని ఎద్దేవా చేశారు.

‘‘మేం గుజరాత్ లో అడగలేదు, ఉత్తర్ ప్రదేశ్ లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ ‘‘ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం అని ట్వీట్ చేశారన్నారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో రెండు నాల్కల దోరణి చూస్తేనే అర్థమవుతోందని పేర్కొన్నారు.

Next Story