రెండేళ్లలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, సీఎం అయ్యేది కేసీఆరే: హరీష్ రావు

by Ajay Maddhiboyina |

రెండేళ్ల‌లో మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, సీఎం అయ్యేది కేసీఆరే అని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. అటున్న సూర్యుడు ఇటు ఉద‌యించినా వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అన్నారు.

రెండేళ్లలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, సీఎం అయ్యేది కేసీఆరే: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: రెండేళ్ల‌లో మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, సీఎం అయ్యేది కేసీఆరే అని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. అటున్న సూర్యుడు ఇటు ఉద‌యించినా వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అన్నారు. సింగ‌రేణిని దోచుకుని రేవంత్ రెడ్డి అడ్డ‌గోలుగా సంపాదించాడ‌ని అన్నారు. ఓట్లు వేస్తామ‌ని ఒట్టుపెట్టుకోవ‌ద్ద‌ని కావాలంటే పైస‌లు తీసుకుని ఓటు బీఆర్ఎస్ కే వేయాల‌ని అన్నారు. నిరుద్యోగ భృతి, రైతు బంధు ఇత‌ర హామీలు ఏం అయ్యాయ‌ని ప్ర‌శ్నించారు.

ఇచ్చిన హామీల గురించి అడిగితే పేగులు మెడ‌లో వేసుకుని తిరుగుతా, లాగులో తొండ‌లు ఇడుస్తాన‌ని అంటున్నాడ‌ని విమ‌ర్శించారు. హామీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన రేవంత్ రెడ్డి ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. అక్క‌డ రేవంత్ రెడ్డిలాగానే ఇక్క‌డ శిశ్యుడు మంచిర్యాల ఎమ్మెల్యే త‌యార‌య్యాడ‌ని ఎవ‌రు ఇల్లు కట్టాల‌న్నా ట్యాక్స్ క‌ట్టాల్సిందేన‌ని విమ‌ర్శించారు. రేవంత్ లాంటి మూర్ఖుడిని ఓడించాల‌ని ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యార‌ని మండిప‌డ్డారు. హార్వ‌ర్డ్ పోయినా అంత‌రిక్షం పోయినా రేవంత్ రెడ్డి మారే ర‌కం కాద‌న్నారు. రేవంత్ లాంటి మూర్ఖుడిని ఓడించాల‌ని ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యార‌ని అన్నారు.

Next Story