- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: రేవంత్ సర్కార్ పగతో పని చేస్తోంది.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలపై ప్రేమను చూపించాల్సిన ప్రభుత్వం పగతో పని చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలపై ప్రేమను చూపించాల్సిన ప్రభుత్వం పగతో పని చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన సిద్దిపేట జిల్లా (Siddipet) చిన్నకొడూర్ (చిన్న కోడూర్) మండల పరిధిలోని చౌడారం (Choudaram) సమీపంలో బిక్కబండకు వెళ్లే కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కొలువుదీరాక కాల్వల భూ సేకరణకు నిధులు విడుదల చేయలేదని ధ్వజమెత్తారు.
అన్ని ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా ఉద్దేశపూర్వకంగా రైతులకు నీళ్లు వదలడం లేదని అన్నారు. దీంతో గత్యంతరం లేక అన్నదాతలు తమ సొంత ఖర్చుతో కాల్వలు తవ్వుకుని తమ పంటలను తడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల భూసేకరణకు రూ.20 కోట్లు విడుదల చేస్తే.. మరింత భూమి సాగులోకి వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)ను కాంగ్రెస్ సర్కార్ (Congress Government) అవహేళన చేస్తోందని అన్నారు. ఉత్తర తెలంగాణ (North Telangana)కు ఆ ప్రాజెక్ట్ ఒక వరమని పేర్కొన్నారు. కాళేశ్వరం వల్లే ఇవాళ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని కామెంట్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.






