- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Harish Rao: సీఎం రేవంత్.. దమ్ముంటే గ్రామ సభలకు రా: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన సవాల్

దిశ, వెబ్‌డెస్క్: దమ్ముంటే గ్రామ సభలకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సవాల్ విసిరారు. ఇవాళ సిద్దిపేట (Siddipet) జిల్లా గడిచెర్లపల్లి (Gadicharlapally) గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాపాలన అండ ఏడాది క్రితం ప్రజల నుంచి వివిధ పథకాల అమలుకు దరఖాస్తు తీసుకున్నారని.. నేటికీ వాటికి దిక్కులేదని మండిపడ్డారు. ఇచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు ఇవ్వాలని ఫైర్ అయ్యారు. అబద్ధపు పునాదులపై, పచ్చి మోసపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పి మోసపూరిత మాటలను నమ్మి అన్నదాతలు నిలువునా మోస పోయారని ధ్వజమెత్తారు. పోలీసుల నిర్భందాల నడుమ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం సిగ్గచేటని అన్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రామ సభలకు హాజరు కావాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.