- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : రేవంత్ రెడ్డివి చిల్లర రాజకీయాలు : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరీ చిల్లర రాజకీయాలకు దిగాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరీ చిల్లర రాజకీయాలకు దిగాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతి(Basaveshwara Jayanthi)ని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడని మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నాడని, పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేసి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని.. కళ్లలో, కడుపులో పెట్టుకున్న విషాన్ని ఆపుకోలేక ఈరోజు బయట కక్కిండని అన్నారు.
కేసీఆర్(KCR) గురించి అవే చిల్లర మాటలు మాట్లాడి, కుక్క తోక వంకరే అని మరోసారి రుజువు చేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే అని పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ కు కల్పించి, కేంద్రం మెడలు వంచి సాధించిండు కేసీఆర్ అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని నువ్వే అంటున్నావు, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, మాది ప్రజా పాలన అంటున్నావు రేవంత్ కు జపాన్ వెళ్లి వచ్చి మైండ్ పాడైనట్లుంది లేకుంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయినట్లుందన్నారు. ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలి అంటున్నడు... కేసీఆర్ కిట్టు ఆగిపోలేదా, దళిత బంధు ఆగిపోలేదా, బీసీ బంధు ఆగిపోలేదా, గొర్రెల పంపిణీ ఆగిపోలేదా, రెండు నెలల పింఛన్లు ఆగలేదా, డబుల్ బెడ్ రూం ఇళ్లులు ఆగలేదా, స్కాలర్ షిప్స్ ఆగలేదా, ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.
మీ 15 నెలల పాలనలో ఆగని పథకం ఏదైనా ఉందా అంటూ.. ఆరు గ్యారెంటీలు ఏమైనయి, ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏమైనయి జాబ్ క్యాలెండర్ ఏమైంది, విద్యార్థులకు విద్యాభరోసా కార్డు ఏమైంది, విద్యార్థినులకు స్కూటీ ఏమైంది, మహిళలకు 2500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, కౌలు రైతులకు భరోసా ఏమైంది, 15వేల రైతు భరోసా ఏమైంది అని నిలదీశారు. "నీ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా రేవంత్ రెడ్డి.. నువ్వు అన్నట్లు కాళేశ్వరం మీద చర్చ పెడుదామా? రుణమాఫీ మీద పెడుదామా? రైతు బంధు మీద పెడుదామా? నీ బోగస్ 60వేల ఉద్యోగాల మీద పెడుదామా, కులగణన మీద పెడుదామా? దేని మీదైనా చర్చకు సిద్దం, ప్లేస్, టైం నువ్వే చెప్పు" అని హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు.






