- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: పోలీసులు లేకుండా ఒక్క సారికి అశోక్ నగర్ రా..! సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి.. పోలీసులు లేకుండా ఒక్క సారికి అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రా అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నీకు దమ్ముంటే (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి.. పోలీసులు లేకుండా ఒక్క సారికి అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రా అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వించిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చాడని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్ అని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడి పోయిందన్నారు. ‘మాటలు బోగస్ హామీలు బోగస్, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు, రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉంది, కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ను జూబ్లిహిల్స్‌లో ఓడించాలి’ అని హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్ కు అర్థం కావాలన్నారు. జీవో 29, జీవో 55 పై నేను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడానని అన్నారు. భట్టి విక్రమార్క దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదన్నారు. జాబ్‌లు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి కన్నులు పెట్టి బెదిరిస్తున్నారని, రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి పంపించాడు అని మంత్రి కుమార్తె చెప్పిందని గుర్తుకు చేశారు.
లక్షా 64 వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ ఇచ్చిందని, మా హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆలస్యం అయ్యిందని, 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించామని తెలిపారు. నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్ష పెట్టింది, ఫిజికల్ టెస్ట్ పెట్టింది, ఎంపిక చేసింది బీఆర్ఎస్ అని, కానీ నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 60వేల ఉద్యోగాలు ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటున్నారని, అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమేనని అన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మేం హామీ ఇస్తున్నాం.. అసెంబ్లీ వేదికగా మీ కోసం పోరాటం చేస్తాం.. మొన్న అడిగితే ఒక్కటే నాడు అసెంబ్లీ పెట్టి పారిపోయిండు.. జెన్కో, జీపీవో, పోలీస్, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తామని అన్నారు. ప్రత్యక్ష పోరాటం బీఆర్ఎస్ చేస్తుంది, మీకు అండగా ఉంటదని హరీశ్ రావు హామీ ఇచ్చారు.






