- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఢిల్లీలో కాదు గల్లీకి రా.. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు

దిశ, డైనమిక్ బ్యూరో : అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ల ప్రభుత్వం అని, భూమి పంచాయతీ కోసం 30 శాతం ఇవ్వాలంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నాడని ఆరోపించారు. ఇవాళ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు (RMP PMP Dharna) చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరు ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డుదాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉందని విమర్శించారు. ప్రస్తుతం ఆయన భూమిపై కాకుండా గాల్లో విహరిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టి రేవంత్‌రెడ్డి కళ్లు తెరిపించాలన్నారు.
హామీలు నెరవేర్చమంటే కేసులా?
ఆర్ఎంపీ, పీఎంల తెరువు వచ్చిన ఎవరూ బాగుబడలేదన్నారు. ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. మీ పక్షాన అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వారికి భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ఆర్ఎంపీ, పీఎంపీలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు సరెండర్ లీవ్ 15 రోజులు ఇస్తే, కాంగ్రెస్ వచ్చి 7 రోజులకు తగ్గించిందని అన్నారు. పోలీసులకు పీఎఫ్ పడటంలేదని, ఆరోగ్య భద్రత కార్డు పనిచేయట్లేదని, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీలో కాదు గల్లీలోకి రా..
మహారాష్ట్ర, ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లు కూడా పడలేదు. రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో మాట్లాడటం కాదు.. పోలీసులు లేకుండా తెలంగాణలో ఏదైనా ఓ గ్రామానికి వెళ్దాం రా అని సవాల్ విసిరారు. అక్కడ జనమే మన ఇద్దరి సంగతి చెబుతారన్నారు. స్పీచ్ లు ఎన్నైనా ఇవ్వొచ్చు. కుర్చీలో కుర్చున్నాక అసలు రంగు బయటపడుతుందన్నారు. ఒక ఏడాదిలో లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు.






