- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హోటల్ ఫోటోలు త్వరలోనే బయటపెడుతా.. భట్టి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
నైని, సోలార్ స్కామ్ లే కాదు ఇంకా చాలా స్కామ్ లు ఈ ప్రభుత్వం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డే అవినీతి చేస్తున్నారంటే ఆయనతో మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. సింగరేణిలో నైని, సోలార్ స్కామ్‍లే కాదని ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయని వాటిని త్వరలోనే బయటపెడతానన్నారు. సైట్ విజిట్ విధానం లోపభూయిష్టం అని ఇది వద్దని సింగరేణికి ఫిర్యాదులు వచ్చింది నిజం కాదా? ఈ విషయం మీటింగ్‍లో మాట్లాడారా లేదా బయటపెట్టాలని భట్టికి చాలెంజ్ చేశారు. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ బయటపెట్టాలన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. సీఎం బావమరిది ఏ హోటల్ లో కూర్చుని టెండర్లు నిర్ణయించారో మాకు తెలుసని ఆఫోటోలు కూడా సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు.
ఎక్కడ మాట్లాడుదామో చెప్పు:
టెండర్ల విషయంలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భట్టి దాటవేశారని ఈ విషయంలో మసిపూసి మారెడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపించారు. సైట్ విజిట్ నిబంధన బీఆర్ఎస్ హాయంలోనే వచ్చిందని భట్టి అబద్ధం చెప్పారన్నారు. సింగరేణి టెండర్లను సీఎంపీడీఐ, మెకాన్, ఆర్ఐపీడీఎస్ పరిశీలిస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ వారికి టెండర్లు ఇచ్చుకునేందుకే ఈ సంస్థలను పక్కన పెట్టారని ఆరోపించారు. 2018 నుంచే సైట్ విజిట్ నిబంధన ఉందని భట్టి మాట్లాడారు. కానీ ఓబీ (ఓవర్ బర్డెన్ రిమూవల్) వర్క్స్ కు గతంలో సైట్ విజిట్ విధానమే లేదన్నారు. నిజాన్ని ఒప్పుకోకుండా ఈ నిందను బీఆర్ఎస్ పైకి నెట్టే ప్రయత్నం భట్టి చేస్తున్నారన్నారు. ఓబీ వర్క్స్ లో సైట్ విజిట్ విధానం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ విషయంలో ఎక్కడైనా మాట్లాడుదామో భట్టి చెప్పాలన్నారు. 2025 జనవరిలో భూపాలపల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారు. దీనికి సైట్ విజిట్ లేకుండానే చేశారు. అంటే మీ ప్రభుత్వం తొలినాళ్లలో పాత బీఆర్ఎస్ విధానాన్నే ఇక్కడ అమలు చేశారు. ఆ తర్వాత మూడు నెలలకు 2025 మే నెలలో వీఆర్ఓసీ టెండర్ ను సైట్ విజిట్ తో పిలిచారు.దీని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి శోధా కన్ స్ట్రక్షన్ అని ఆరోపించారు.
READ MORE ....






