రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు: ధర్మాసనం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

రైతు రుణమాఫీపై హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ`+ విచారణ చేపట్టింది.

రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు: ధర్మాసనం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. రాష్ట్రంలో అర్హులైన అనేకమంది అన్నదాతలకు రుణమాఫీ కావడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దాఖల చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం అర్హులైన రైతులకు కూడా అందడం లేదని హరీశ్ రావు తరఫు న్యాయవాది ఆరోపించారు. ఒక్క సిద్దిపేట (Siddipe) నియోజకవర్గంలోనే సుమారు 23 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని కోర్టుకు తెలిపారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని, వారి తరఫున న్యాయం చేయాలని హరీవ్ రావు తరఫు న్యాయవాది కోరారు.

కోర్టులో ప్రభుత్వ వాదన.. హైకోర్టు సూచన

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. హరీశ్ రావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. ఇది సామాన్య ప్రజల సమస్య కాబట్టి, వ్యక్తిగత పిటిషన్‌కు బదులుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public Interest Litigation) దాఖలు చేసుకోవాలని సూచించారు. అయితే, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం, ప్రజల సమస్య కాబట్టి ‘పిల్’ దాఖలు చేయాలని హరీశ్ రావుకు సూచించింది. కోర్టు సూచనను గౌరవిస్తూ హరీశ్ రావు తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. త్వరలోనే ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story