- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిటిషన్‌ను డిస్మిస్ చేసినందుకు సంతోషం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది. ఓ వైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలుపగా.. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా..? అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ తరఫు లాయర్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర చట్టసభల్లో ఆమోదం పొందాయని తెలిపారు. కానీ, కావాలనే కొందరు బీసీ రిజర్వేషన్ల అమలుకు సర్కార్ విడుదల చేసిన జీవోపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును డిస్మిస్ చేసినందుకు తాము సంతోషిస్తున్నామని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.






