- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కించే స్కీమ్ ఇదే.. ఇంటింటి ప్రచారానికి ప్లాన్!
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకమే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకమే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కార్అమలు చేస్తున్న పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇదేనని అన్ని వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం పంపిణీతో చరిత్ర నమోదు చేసుకోగా.. సన్నబియ్యం పంపిణీతో రేవంత్ పాలనకు ప్రత్యేక ముద్ర పడింది. దొడ్డు బియ్యం సరఫరా చేసే సమయంలో రాష్ట్ర వాటాగా ఏటా రూ.5,175 కోట్లు కేటాయించగా, సన్నబియ్యంతో మరో రూ.3వేల కోట్ల ఆదనపు భారం పడింది. ఏప్రిల్ మొదటి వారంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆట్టహాసంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. తర్వాత ఊహించని విధంగా కేంద్రం 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి లబ్ధిదారులు ఇవ్వాలని ప్రకటన చేయడంతో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత మేలు చేకూర్చింది.
ప్రజల నుంచి ప్రశంసలు
సన్నబియ్యం ఒకేసారి ఇంత మొత్తంలో ఇవ్వడంపై పేద, మధ్య తరగతి ప్రజలంతా రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సన్నబియ్యం నిర్ణయం కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి గ్రామాల్లో ఉండే అధికార పార్టీ నేతలు సన్న బియ్యం పథకం గురించి ప్రజలకు వివరిస్తూ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపిస్తే మరిన్ని పథకాలు తీసుకొస్తామని ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ రేషన్‌కార్డుల ఊసెత్తలేదని, తాము అధికారం చేపట్టిన తర్వాత కొత్త దరఖాస్తులు స్వీకరించి 2.50 లక్షల మందికి మంజూరు చేసినట్లు ఊరంతా ప్రచారం చేస్తూ స్థానిక పోరులో దిగితే గెలుపు వరిస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
3.14 కోట్లకు చేరిన లబ్ధిదారుల సంఖ్య
రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరింది. గత ప్రభుత్వంలో 91 లక్షల కార్డులుండగా 2.84 కోట్ల మంది లబ్ధిదారులు మాత్రమే ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వెంటనే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవడం, గ్రామసభలు ఏర్పాటు చేసి అక్కడే అర్హులైన వారిని ఎంపిక చేసి కార్డులు అందజేసింది. కొత్త రేషన్‌కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు, కుటుంబ సభ్యుల చేర్పుల కోసం 16 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో 13 లక్షల మంది పేర్లు యాడ్‌కాగా, కొత్తగా 2.50 కార్డులు మంజూరయ్యాయి. గ్రామసభలో 10 వేల కార్డులకు పత్రాలు ఇవ్వగా, ఈ నెల 14న మిగతా 2.40 లక్షల మందికి కార్డులకు సంబంధించిన పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది. ఇంత మొత్తంలో లబ్ధిదారులు ఉండటంతో వారిలో 70 శాతం మంది స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే 32 జిల్లా పరిషత్‌లకు 25 నుంచి 28 చైర్మన్లు గెలుచుకుంటామని కాంగ్రెస్‌నేతలు గణంకాలు వేస్తున్నారు.
సన్నబియ్యం పంపిణీపై కాంగ్రెస్ ప్రచారం
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనా సన్నబియ్యం పంపిణీ రేవంత్ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది. దీనిని ఎన్నికల్లో ప్రచారంగా వాడుకుని సర్పంచులు, ఎంపీపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేలా ఎమ్మెల్యేలు ప్లాన్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్వస్తుందని, అప్పటిలోగా ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోరులో మంచి ఫలితాలు వస్తే కాంగ్రెస్సర్కార్వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎగుర వేస్తుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రేవంత్సర్కార్తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఓటరుకు తెలిసేలా వార్డు స్థాయి కార్యకర్తలు అవగాహన చేయాలని సూచిస్తున్నారు.






