వివాదాస్పదమైన సంస్థకు సీబీఎస్ఈ పనులు ఎలా ఇస్తారు?

by velandi.Saikiran |

తెలంగాణలో వివాదాస్పదమైన సంస్థకు సీబీఎస్ఈ పనులు ఎలా ఇస్తారు? అని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు సీరియ‌స్ అయ్యారు.

వివాదాస్పదమైన సంస్థకు సీబీఎస్ఈ పనులు ఎలా ఇస్తారు?
X

తెలంగాణలో వివాదాస్పదమైన సంస్థకు సీబీఎస్ఈ పనులు ఎలా ఇస్తారు?

సీబీఎస్ఈ ఆన్‌లైన్ మార్కింగ్ కాంట్రాక్టుపై జ్యుడీషియల్ విచారణ జరపాలి..

-ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆన్-స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్టు కేటాయింపులో జరిగిన అక్రమాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన జ్యుడీషియల్ విచారణ డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో తెలంగాణ బోర్డు పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన సంస్థకే కేంద్రం మళ్లీ కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు.

ప్రస్తుతం సీబీఎస్ఈ మార్కింగ్ పనులు చేపడుతున్న 'కోఎంప్ట్' సంస్థ గతంలో 'గ్లోబరీనా' పేరుతో ఉండేదని ఆయన గుర్తుచేశారు. గ్లోబరీనా సంస్థ 2019, 2023లో తెలంగాణ బోర్డు పరీక్షల నిర్వహణలో తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందన్నారు. అటువంటి సంస్థ పేరు మార్చుకుని వస్తే, ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పనులను అప్పగించిందని విహెచ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణతో పాటు, సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్ ప్రభుత్వాన్ని కోరారు.

Next Story