- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ప్రభుత్వం అందెశ్రీ త్యాగాన్ని గుర్తించలేదు: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
by Ajay Maddhiboyina |
అభిమానుల సందర్శనార్థం లాలాపేట్ జీజీహెచ్ గ్రౌండ్స్‌లో అందెశ్రీ పార్థివదేహాన్ని పెట్టారు. దీంతో అన్ని పార్టీల రాజకీయనాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వస్తూ అందెశ్రీకి నివాళులు అర్పిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: అభిమానుల సందర్శనార్థం లాలాపేట్ జీజీహెచ్ గ్రౌండ్స్‌లో అందెశ్రీ పార్థివదేహాన్ని పెట్టారు. దీంతో అన్ని పార్టీల రాజకీయనాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వస్తూ అందెశ్రీకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సైతం విచ్చేసి నివాళులు అర్పించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ పాటలు బాగా రాసేవాడని ఇంత త్వరగా చనిపోవడం బాధగా ఉందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడన్నారు. పెద్దగా చదువుకోకపోయినా మానవత్వం అనే ఆలోచనతో కష్టపడ్డాడని చెప్పారు. కానీ గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న అందెశ్రీ త్యాగాల గురించి ఆలోచించలేదని, ఆయన రాసిన పాటను పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అందెశ్రీ రాసిన పాటను రాష్ట్రీయగీతంగా గుర్తించామన్నారు. రేవంత్ రెడ్డి అందెశ్రీ కష్టాన్ని గుర్తించాడని చెప్పారు.
Next Story






