- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తకళలు అంతరించకుండా పరిరక్షించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లు ఆకట్టుకునేలా నిలుస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లు ఆకట్టుకునేలా నిలుస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం తెలంగాణ హస్తకళల అభివృద్ది కార్పోరేషన్, భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండీ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరించిపోతున్న హస్త కళలను పరిరక్షించాలని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం హస్త కళాకారులకు ఉపాధి దొరికేలా అవకాశాలు కల్పించాలన్నారు. ఎంతో ప్రత్యేకమైన హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లను, చేనేత ఉత్పత్తు లను పుణ్య క్షేత్రాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల లాంటి ముఖ్యమయిన ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని సూచించారు. ఎగ్జిబిషన్ లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 150 హస్త కళల, చేనేత ఉత్పత్తుల స్టాళ్లను అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
అనంతరం 2024-25 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది హస్త కళల కళాకారులకు రాష్ట్ర స్థాయి అవార్డులతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో హస్తకళల అబివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్ టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ , అసిస్టెంట్ డైరెక్టర్ సువార్చల రాణి తదితరులు పాల్గొన్నారు.






