తుది దశకు చేరిన హ్యామ్ రోడ్లు

by Muthe.Rajitha |   (  Updated:2025-10-22 16:51:18  IST  )

హ్యామ్ రోడ్ల కు గురువారం టెండర్లు విలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

తుది దశకు చేరిన హ్యామ్ రోడ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హ్యామ్ రోడ్ల కు గురువారం టెండర్లు విలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5566.15 కిలోమీటర్ల రోడ్లను మొదటి విడత హ్యామ్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఈ రోడ్లకు రూ.10,547.38 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 32 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నామని అన్నారు.దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్ర రోడ్లను నిలుపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.

వాయిదా పడుతూ వస్తున్న హ్మామ్ రోడ్ల జాబితా తుది దశకు చేరింది. మొదటి సారిగా హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాలు సర్కార్ పచ్చ జెండా ఊపింది. మొదటి విడతలో 32 ప్యాకేజీల కింద రాష్ట్రవ్యాప్తంగా 5,566.15 కిలోమీటర్ల రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సి ఎస్ రామకృష్ణారావు హ్యామ్ విధానంలో చేపట్టనున్న 32 ప్యాకేజీల్లోని 5,566.15 కిలోమీటర్ల రహదారులకు రూ. 10,547.38 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలువాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఉత్తర్వులతో ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని 400 రోడ్లను పునరుద్ధరించనున్నారు. హ్యామ్ లో సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. డబుల్ లేన్ రోడ్డును నాలుగు వరుసగా రోడ్డుగా మార్చనున్నారు. జున్ లో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో మొదటి విడతలో దాదాపు రూ.6478.33 కోట్లతో, 17 ప్యాకేజీల కింద 373 రోడ్లను నిర్మించేందుకు ఆమోదించింది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5190.25 కిమీటర్ల పొడువు రహదారులు నిర్మించేందుకు నిర్ణయించారు.

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు మొదటి విడతలో చేపట్టనున్న రోడ్ల జాబితాను సవరించారు. కొన్ని చేర్పులు మార్పులు చేసి కొత్త జాబితాను రూపొందించారు. అందులో 32 ప్యాకేజీల కింద రోడ్ల మరమ్మతులను చేపట్టేందుకు నిర్ణయించారు. తాజాగా గుర్తించిన రోడ్లలో... ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఉండీ, సమస్యాత్మకంగా మారిన రహదారులు, శిథిలావస్థకు చేరిన రోడ్లు, భాగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రాధాన్యత కల్పించారు.

40:60 నిష్పత్తితో నిధులు

హ్యమ్ విధానంలో చేపట్టనున్న ఆర్ అండ్ బిస్ రోడ్ల నిర్మాణాల వ్యయాన్ని ప్రభుత్వం, గుత్తేదారులు 40:60 నిష్పత్తితో నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో పునరుద్దరించనున్న పలు రోడ్లకు 40 శాతం నిధులు ప్రభుత్వం కేటాయిస్తే, 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాలి. కాంట్రాక్టర్లు ఖర్చు చేసిన నిధులన ప్రభుత్వం వాయిదా పద్దతిలో వడ్డీతో కలిపి చెల్లించనున్నది. 60 శాతం నిధులలో కూడా బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పించనున్నది.

Next Story