- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లకు సెలవులు.. వీళ్లకు సెలవులు రద్దు
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 13, 14న వర్షాల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వగా, ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించేలా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు.. ఆగస్టు 15న సెలవు కలిసి రావడమే కాకుండా ఆగస్టు 16న కృష్ణాష్టమి, ఆ తరువాత ఆదివారం కూడా కలుపుకొని మొత్తం 5 రోజులు హాలిడేస్ వచ్చాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు టూర్లు, షికార్లు ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. GHMC, HYDRAA, విద్యుత్, రెవెన్యూ, వైద్య, పోలీస్ విభాగాల సిబ్బందికి రేపటి వరకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు మరో రోజూ కొనసాగే అవకాశం ఉన్నందున.. నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి సెలవులు కొందరికి సంతోషాన్ని కలిగిస్తే, మరికొందరికి మరింత పని పెంచాయి.






