వివాదాస్పదమవుతున్న బీరుతో హల్దీ ఫంక్షన్..!

by Disha Web Desk 4 |
వివాదాస్పదమవుతున్న బీరుతో హల్దీ ఫంక్షన్..!
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ఓ పెళ్లి వేడుక వివాదాస్పదమవుతుంది. అత్యంత పవిత్రంగా గౌరవప్రదంగా జరగాల్సిన పెళ్లి తంతు బీరుతో హల్దీ ఫంక్షన్ (మంగళ స్నానాలు) నిర్వహించడంతో వివాదాలకు దారితీస్తోంది. వేదమంత్రాలతో రెండు కుటుంబాలను రెండు మనసులను ఏకం చేస్తూ నూరేళ్ల జీవితానికి వేదిక అయ్యే ఈ పెళ్లి కార్యక్రమం రోజురోజుకు కొత్త పోకడలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం నెటిజన్ల నుండి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.


Next Story

Most Viewed