- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గాం మారణకాండను నిరసిస్తూ "హైందవశంఖారావం" కవి సమ్మేళనం
జమ్ము కాశ్మీర్ పహెల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తు భారత్ వికాస్ పరిషత్, బివిపి చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని భారత్ వికా

దిశ, కూకట్పల్లి: జమ్ము కాశ్మీర్ పహెల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తు భారత్ వికాస్ పరిషత్, బివిపి చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ సత్సంగ్ హాల్లో హైందవ శంఖారావం కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడు నాగశేఖర్ గుప్తా, పోషకులు సిహెచ్. హనుమంత్ రావు, చారిత్రక నవలా రచయిత ఆచార్య ముదిగొండ శివప్రసాద్, సాహితి వేత్త మావుడూరు సూర్యనారాయణ ముర్తి, ఇతిహాస సంకలన సమితి సభ్యులు ఇందు శేఖర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడి ప్రస్తుత సమస్య కాదు, దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని అన్నారు. అనంతరం సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రతి భారతీయుడు నిద్రను వీడి చైతన్యంతో ఉగ్రవాద దాడిని ఖండించాలని అన్నారు. ప్రతి ఒక్కరు సైనికులకు, ప్రభుత్వానికి అండగా నిలవాలసి అన్నారు. అనంతరం సిహెచ్. హనుమంత్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం సైనికులకు, ఉగ్రవాద దాడిలో మృతి చెందిన మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసిపి. గుప్తా, పెద్దురి వేంకట దాసు, సాంబమూర్తి, రవీంద్రనాథ్, ఓఝల శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.






