- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మంచు...హిమాలయాలను మించిపోయేలా !
హిమాలయాలను తలపించే విధంగా.. రోడ్డుపై మంచు పేరుకుపోయిన సంఘటన హైదరాబాద్ ఔట్ కట్స్ లో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లో వడగళ్ల వర్షం
శంషాబాద్ నుంచి నాదర్‌గుల్ మధ్య ప్రాంతంలో కురిసిన వడగళ్ళ వాన
హిమాలయాలను తలపించే విధంగా.. రోడ్డుపై పేరుకుపోయిన మంచు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం వడగళ్ల వర్షం భారీగా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్ - నాదర్‌గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా భారీ వడగండ్ల వర్షం పడింది. ఈ క్రమంలో రోడ్డంతా మంచు ముక్కలతో నిండిపోయింది. హిమాలయాలను తలపించే విధంగా రోడ్డుపై మంచు పేరుకుపోయిన నేపథ్యంలో జనాలు అవాక్కవుతున్నారు. అంతేకాదు, రోడ్డంతా మంచుతో ఉన్న నేపథ్యంలో అక్కడి స్థానికులు ఫోటోలు దిగుతూ చిల్ అవుతున్నారు. కొందరు రీల్స్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలను చూసిన నెటిజెన్స్ రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ నగరం... హిమాలయాలు, కాశ్మీర్ ను తలపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.






