Breaking News : తెలంగాణలో 13 జిల్లాలకు వైద్యాధికారులను నియమించిన సర్కార్

by Muthe.Rajitha |

తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Breaking News : తెలంగాణలో 13 జిల్లాలకు వైద్యాధికారులను నియమించిన సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 13 జిల్లాలకు ఇంచార్జ్ డీఎంహెచ్వోస్(DM&HO'S) ను నియమిస్తూ తెలంగాణ వైద్యారోగ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ కు డా. నరేంద్ర, జనగాంకు డా. మల్లిఖార్జునరావు, జోగుళాంబ గద్వాలకు డా.కె సిద్దప్ప, ఖమ్మంకు బానోత్ కళావతి బాయి, కొమురంభీం ఆసిఫాబాద్ కు డా.కె సీతారాం, మహబూబాబాద్ కు డా.జి మురళీధర్, మహబూబ్ నగర్ కు డా. కె కృష్ణ, ములుగుకు డా.గోపాల్ రావు, పెద్దపల్లికి డా. ఏ ప్రసన్నకుమారి, సిద్దిపేటకు డా. బి పల్వన్ కుమార్, వికారాబాద్ కు డా. వై వెంకటరమణ, వనపర్తికి డా. ఏ శ్రీనివాసులు, యాదాద్రి భువనగిరికి డా. ఎమ్ మనోహర్ లను ఇంచార్జ్ డీఎంహెచ్వోస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story