వచ్చేనెల 15లోగా కంప్లీట్ కావాలి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశం

by Gantepaka Srikanth |

వచ్చే నెలలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని.. ఆగస్టు 15లోపు శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు.

వచ్చేనెల 15లోగా కంప్లీట్ కావాలి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెలలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని.. ఆగస్టు 15లోపు శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. శాసనసభ ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులపై ఆర్అండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర అధికారులతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రానున్న సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారని, వచ్చే శాసనమండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని వివరించారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా, వేగం పెంచాలని, వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్, సీఎం సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహచార్యులు, ఈఎన్సీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story