రానున్నది వర్షాకాలం.. ఆలోపే పనులన్నీ పూర్తవ్వాలి: గుత్తా సుఖేందర్‌ రెడ్డి

by Gantepaka Srikanth |

కాంట్రాక్టర్లు పనులలో వేగం పెంచాలని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

రానున్నది వర్షాకాలం.. ఆలోపే పనులన్నీ పూర్తవ్వాలి: గుత్తా సుఖేందర్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంట్రాక్టర్లు పనులలో వేగం పెంచాలని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కెనాల్, పిలాయిపల్లి కెనాల్, బునాదిగాని కెనాల్స్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్, బీర్ల ఐలయ్య, మందుల సామేల్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, పనులను త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. రానున్నది వర్షాకాలం కావడంతో రైతులు ఆందోళలో ఉన్నారని.. వారిని సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి, బునాదిగాని కెనాల్స్ పనులు పూర్తిచేయడానికి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరం చేసుకుంటూ వర్క్స్ పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వం స్థిరికరించిన ఆయకట్టుకు నీరందించే విధంగా అధికారులు పనిచేయాలని, కాలువలపై ఉన్న అక్రమ మోటర్లను తొలగించాలని ఆయన వివరించారు.

Next Story