- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.. గన్ మెన్ కృష్ణ చైతన్య తండ్రి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. హయత్‌నగర్‌లోని తన ఇంట్లో కృష్ణ చైతన్య గన్ తో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. హయత్‌నగర్‌లోని తన ఇంట్లో కృష్ణ చైతన్య గన్ తో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశారు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రిలో చైతన్యకు చికిత్స జరుగుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తాజాగా కృష్ణ చైతన్య తండ్రి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్థిక సమస్యలు, బెట్టింగ్ వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం చేశాడు అనే వార్తలను ఖండించారు.
ఉదయం 6గంటలకు గన్ పేలిన శబ్ధం వచ్చిందన్నారు. తమ కోడలు సమాచారం ఇచ్చిన వెంటనే కృష్ణ చైతన్యను ఆస్పత్రికి తరలించామన్నారు. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తమ కుటుంబం ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉందని అన్నారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లాంటి అలవాట్లు కూడా తమ కుమారుడికి లేవని చెప్పారు. మళ్లీ డ్యూటీకి వెళ్లేందుకే సర్వీస్ రివాల్వర్ ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడని అనుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సర్జరీ జరుగుతోందని, అసలేం జరిగిందో పోలీసుల దర్యాప్తులో తెలుస్తుందన్నారు.
ఇదిలా ఉంటే ఆర్థిక సమస్యల వల్లే గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని కోరారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో కానిస్టేబుల్ చైతన్యను కలిసినట్టు చెప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని అన్నారు. దాదాపు 3 నెలల క్రితం కుటుంబ సమస్యలతో గొడవల వల్ల కృష్ణ చైతన్య ఇంటి నుండి వెళ్లిపోయాడన్నారు. అప్పటి నుండి కృష్ణ చైతన్య నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు.






