- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల(Pulivendhula)లో తుపాకీతో దాడి(Gun attack) చేసిన ఘటన కలకలం రేపింది. తుమ్మలపల్లికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తిపై రౌడీ షీటర్ లక్ష్మీకాంత్ రెడ్డి(బబ్లూ), శివలు తుపాకీతో దాడి చేశారు. దాడిలో నాగిరెడ్డి తలకు తీవ్ర గాయమైంది. నాగిరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో వైఎంసీ క్లబ్ లయోలా కాలేజీ వద్ద ఈ దాడి ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీల వివాదాలే కాల్పులకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా పులివెందులలో రౌడీలకు ఇష్టానుసారం గన్ లైసెన్స్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది మార్చి నెలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో త్రుటిలో బయటపడ్డాడు. తాజాగా మరో రౌడీ షీటర్ తుపాకీతో తలపై బలంగా కొట్టడంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులతో పాటు గన్‌మెన్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే 180 మందికి తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్లు ఉన్నట్లుగా సమాచారం.






