DGP Jitender: ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం.. తెలంగాణ డీజీపీ జితేందర్

by Ramesh Naini |

చార్మినార్‌ సమీపంలోని మీర్‌చౌక్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

DGP Jitender: ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం.. తెలంగాణ డీజీపీ జితేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Charminar Fire Accident) చార్మినార్‌ సమీపంలోని మీర్‌చౌక్ (Gulzar House fire) గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి చేరకున్న తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫ్లోర్‌కు మంటలు వ్యాప్తిచెందాయని అన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు అందించారని తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది చనిపోయారని స్పష్టం చేశారు. మృతుల్లో చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారని తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం ఉదయం గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం సంఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి అధికారులతో నిరంతరం సమీక్ష చేస్తున్నారు.

Next Story