- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరలేదు
by Gantepaka Srikanth |
ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మహిపాల్ రెడ్డి నిర్ణయంతో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో గూడెం మహిపాల్ రెడ్డి దారిలో ఎంత మంది ఎమ్మె్ల్యే నడుస్తారనేది చర్చనీయంశంగా మారింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబధించిన కేసుపై ఈ నెల 25న సుప్రీంకోర్టు విచారించనుంది.
Next Story






