GST ఎగవేత కేసు.. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీకి బెయిల్ మంజూరు

by Malleboina Mahesh |

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న (GST evasion) వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు (GST officials) చర్యలు తీసుకుంటున్నారు

GST ఎగవేత కేసు.. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీకి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న (GST evasion) వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు (GST officials) చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ (Orange Travels MD), తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్(Sunil Kumar)ను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు.. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. అయితే ఈ GST ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో ఈ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ట్రిలియన్ లెడ్ ఫ్యాక్టరీ ఎండీ చేతన్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది.

కాగా ఈ పరిణామాలపై స్పందించిన సునీల్ కుమార్ (Sunil Kumar).. ప్రతి ఏడాది యధావిధిగా నడుస్తున్న బస్సులపై 5% GST ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ కడుతుందని, అధికారులు దాన్ని 12 శాతానికి పెంచి మరో రూ.24 కోట్లు అదనంగా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఎన్నో కష్టాల్ని అధిగమించి ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, రెండు మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ చెప్పుకొచ్చారు.

Next Story