- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GSLV-F16 విజయవంతం.. ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు. నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుంచి నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ - ఎఫ్ 16 ( GSLV-F16) ప్రయోగం విజయవంతమైన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సహకారంతో చేపట్టిన ఈ మిషన్ విజయం అంతరిక్ష పరిశోధన చరిత్రలో మహత్తరమైన ఘట్టమని వ్యాఖ్యానించారు.
"ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ – నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహాన్ని మోసుకెళ్ళిన GSLV-F16 ప్రయోగం చరిత్రాత్మక పురోగతికి నిదర్శనం" అని పేర్కొన్నారు. నిసార్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అంతర్జాతీయ శాస్త్రీయ సహకారంలో ముందడుగు అని, ఇందులో భారతీయ శాస్త్రవేత్తల పనితీరు గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.






