GSLV-F16 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ఎమ్మెల్సీ కవిత స్పెషల్ విషెస్

by Kema Shiva Kumar |

GSLV-F16 ప్రయోగాం విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆనందం వ్యక్తం చేశారు.

GSLV-F16 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ఎమ్మెల్సీ కవిత స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: GSLV-F16 ప్రయోగాం విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆనందం వ్యక్తం చేశారు. NISAR శాటిలైట్‌ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ‌పెట్టడంపై ఇస్రోను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు కవిత సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మన దేశం ఇవాళ సాయంత్రం నీసార్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా, మన తెలంగాణకు, అందులోనూ మరీ ముఖ్యంగా నిజామాబాద్‌కు గర్వకారణం. ఈ గొప్ప కార్యానికి సహకరించిన శాస్త్రవేత్తల్లో ఒకరు మా స్వస్థలం నిజామాబాద్‌కు చెందినవారు ఉన్నారని కవిత ట్వీట్ చేశారు.

కాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అలయన్స్‌తో తొలిసారి రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (NISAR) అనే శాలిలైట్ నిసార్‌ GSLV-F16 ప్రయోగం సక్సెస్ అయింది. జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-16) రాకెట్‌ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని మన శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కి.మీ ఎత్తులో సూర్య సమకాలిక కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ శాటిలైట్ సుమారు 10 ఏళ్లు పాటు సేవలందించనుంది. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు రూ.11,200 కోట్ల వ్యయంతో ఇస్రో, నాసా ఈ జాయింట్ ప్రాజెక్టు్‌కు రూపకల్పన చేశాయి.

Next Story