GSLV-F16 భూశాస్త్రానికి గేమ్ ఛేంజర్ : Bandi Sanjay Kumar

by Muthe.Rajitha |   (  Updated:2025-07-30 15:34:36  IST  )

GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) హర్షం వ్యక్తం చేసారు.

GSLV-F16 భూశాస్త్రానికి గేమ్ ఛేంజర్ : Bandi Sanjay Kumar
X

దిశ, వెబ్ డెస్క్ : GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) హర్షం వ్యక్తం చేసారు. నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుంచి నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన GSLV-F16 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా బండి సంజయ్ ఇస్రో(ISRO), నాసా(NASA) శాస్త్రవేత్తలను అభినందించారు. GSLV-F16 ఉపగ్రహం యొక్క శక్తివంతమైన రాడార్ సాంకేతికతతో NISAR ప్రతి 12 రోజులకు మొత్తం భూగోళాన్ని స్కాన్ చేస్తుందన్నారు.

అధిక రిజల్యూషన్ తో, భూ ఉపరితలం మీద, అలాగే మంచుతో కప్పబడిన ఉపరితలాలను, సముద్రాలను చిత్రీకరిస్తుందని అన్నారు. భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులు, సహజ విపత్తులను, అడవులను పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం సహాయపడుతుందని, NISAR భూశాస్త్రానికి తప్పక గేమ్ ఛేంజర్ అవుతుందని బండి సంజయ్ అభిప్రాయ పడ్డారు.

Next Story