- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్క కొమరయ్యకు పెరుగుతున్న మద్దతు
కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నాయి. గతంలో పలు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, మంగళవారం తెలంగాణ ఆదివాసీ టీచర్స్ అసోయేషన్ మద్దతు ప్రకటించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మేస్రం గంగారం, కల్లూరి జయబాబాబు మద్దతు ప్రతిని మల్క కొమరయ్యకు అందజేశారు. తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ యాదవ్ సంఘం తరఫున మద్దతు ప్రతిని అందజేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో కీలకంగా ఉన్న పలు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మరి కొన్ని రోజుల్లో అనేక సంఘాలు కూడా ఆయనకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడుతారనే విశ్వాసంతో ఉపాధ్యాయ సంఘాలు తనకు స్వచ్ఛంద మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందని, తన బాధ్యత మరింత పెరుగుతోందన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక లోకం తనకు ఓటు వేసి మండలిలో టీచర్ల సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.






