- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Group-II అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ తేదీలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన
గ్రూప్ -2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 (Group-2) పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification) నాలుగో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో వెరిఫికేషన్ కొనసాగుతుందని కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెల 25న రిజర్వ్ డే ఉంటుందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను, అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్‌ను కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్స్‌ను ఈ నెల 22 నుండి 25 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో ఎంచుకోవాలి. ఇవే ఆప్షన్స్ ఫైనల్ సెలెక్షన్ కోసం పరిగణించబడతాయని అందువల్ల అత్యంత జాగ్రత్త వహించాలని అప్రమత్తం చేసింది. పేర్కొన్న తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు రాని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి ప్రక్రియలో పరిగణించబడదని స్పష్టం చేసింది. కాగా మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ గతంలో విడుదలైన సంగతి తెలిసిందే.






