- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-3: గ్రూప్-3 అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్.. మొదలైన వెబ్ ఆప్షన్స్
నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-3 ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 10 సాయంత్రం 5:30 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించినట్లు టీజీపీఎస్సీ (TGPSC) వెల్లడించింది. గ్రూప్-3 (Group-3) ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను టీజీపీఎస్సీ నిన్న (సోమవారం) విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో https://websitenew.tgpsc.gov.in/ అందుబాటులో ఉంచింది. కాగా రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 2.67 లక్షల మంది పరీక్షలకు హాజరు కాగ వీటికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఈ ఏడాది మార్చి 14న విడుదలైంది. తాజాగా ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను (provisional list) విడుదల చేసి వ ఎంపికైన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పించింది.






