TGPSC కీలక అప్డేట్... గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా

by Muthe.Rajitha |

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) మరో కీలక అప్డేట్ విడుదల చేసింది.

TGPSC కీలక అప్డేట్... గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) మరో కీలక అప్డేట్ విడుదల చేసింది. గ్రూప్ 3(Group 3) అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా(Certificate Verification Postpone) వేస్తూ ప్రకటన జారీ చేసింది. టీజీపీఎస్సీ ఇదివరకే జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 18 నుంచి జులై 8 వరకు జరగాల్సిన సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే పోస్టులు మిగిలిపోకుండా ముందుగా గ్రూప్ 2(Group 2) సర్వీసెస్ నియామకాలు పూర్తైన తర్వాత ఈ నియామకాల మిగిలిన ప్రక్రియ మొదలు పెట్టాలని ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది.

Next Story