- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్ 2 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు రాసి నియామకాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు రాసి నియామకాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 29 నుచి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్( టీజీపీఎస్సీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వెరిఫికేషన్ హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్శిటీలో ప్రతి రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుందని పేర్కొంది.
జూన్ 11 న రిజర్వ్ డేగా ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 వరకు కేటాయించబడినట్లు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు మే 26 నుండి కమిషన్ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in) నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన మెటీరియల్‌ను, రోజు వారీ షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ సంతకం చేసిన ఫోటోకాపీ తీసుకురావాలని తెలిపింది.
అభ్యర్థులు మే 27 నుంచి జూన్ 11 సాయంత్రం 5:00 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. . ఏదైనా కారణం వల్ల హాజరుకాలేని అభ్యర్థులను, వెబ్ ఆప్షన్స్ సరిగా నమోదు చేయని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపింది. 783 పోస్టుల గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి. వీటికి 5,51,855 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 2,49,964 మంది హాజరయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటు 2,36,649 మందికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులను ఈ ఏడాది మార్చిలో టీజీపీఎస్సీ విడుదల చేసింది.






