- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC : గ్రూప్ 2 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
గ్రూప్ 2(Group 2) అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కీలక ప్రకటన జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : గ్రూప్ 2(Group 2) అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కీలక ప్రకటన జారీ చేసింది. గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్(Certifiacte Verification) కు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 29 నుంచి జూన్ 10 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వారికి సమాచారం అందించామని.. మిగిలిన వివరాల కోసం కమిషన్ వెబ్సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని కోరింది. కాగా రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL)ను మార్చిలో విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి, తుది ఫలితాలను విడుదల చేయాలని TGPSC లక్ష్యంగా పెట్టుకుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ సంతకం చేసిన ఫోటోకాపీ తీసుకురావాలని తెలిపింది. ఏదైనా కారణం వల్ల హాజరుకాలేని అభ్యర్థులను, వెబ్ ఆప్షన్స్ సరిగా నమోదు చేయని వారిని అనర్హులుగా ప్రకటిస్తామని కీలక సూచన చేసింది. ఆ ఖాళీల కోసం అదనంగా ఇతర అభ్యర్థులను పిలుస్తామని వెల్లడించింది.






