సూపర్ సాంగ్‌తో గ్రూపు-1 మహిళా అభ్యర్థుల నిరసన (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-26 16:01:14  IST  )

గ్రూపు-1 మెయిన్స్ ఎగ్జామ్(Group-1 Mains Exam) ఇష్యూ తెలంగాణ(Telangana)లో హాట్‌టాపిక్‌గా మారింది.

సూపర్ సాంగ్‌తో గ్రూపు-1 మహిళా అభ్యర్థుల నిరసన (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 మెయిన్స్ ఎగ్జామ్(Group-1 Mains Exam) ఇష్యూ తెలంగాణ(Telangana)లో హాట్‌టాపిక్‌గా మారింది. పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో అభ్యర్థులంతా ఎవరికి తోచిన విధంగా వారు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా ఇద్దరు గ్రూ-1 మహిళా అభ్యర్థులు పాట రూపం ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తపరిచారు. మరోవైపు పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉండగా గ్రూపు-1 అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వెళ్లి వారితో మాట్లాడారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీ పక్షాన బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. మీరంతా ప్రశాంతంగా చదువుకోండి.. మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. నేను కేంద్ర మంత్రినైనా.. మీకోసం రోడ్డెక్కుతున్నా అన్నారు.

Click For Video..

Next Story