హ్యామ్ రోడ్ల ఎస్కలేషన్‌కు గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని రహదారుల నెట్‌వర్క్‌ అభివృద్ధికి ఊతమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సిద్ధమైన నేపథ్యంలో అనుమతించిన రోడ్లకు అదనంగా మరో 15శాతం పనులను చేపట్టేందుకు రోడ్లు మరియు భవనాల శాఖకు కేబినెట్ కట్టబెట్టినట్లు సమాచారం.

హ్యామ్ రోడ్ల ఎస్కలేషన్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రహదారుల నెట్‌వర్క్‌ అభివృద్ధికి ఊతమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సిద్ధమైన నేపథ్యంలో అనుమతించిన రోడ్లకు అదనంగా మరో 15శాతం పనులను చేపట్టేందుకు రోడ్లు మరియు భవనాల శాఖకు కేబినెట్ కట్టబెట్టినట్లు సమాచారం. కాగా... వచ్చే ఏడాది జనవరిలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.

ఇప్పటికే గుర్తించిన రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల అభివృద్ధి, గ్రామీణ రహదారుల కలయికలు వంటి పనులను వేగవంతం చేసేందుకు హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్‌ (హ్యామ్) పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి ఇందుకు గత కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.10,547 కోట్ల వ్యయంతో 400 రోడ్లకు గాను 5566 కి.మీ మేర రహదారుల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

15 శాతం అదనపు పనులకు మంత్రికి స్వేచ్ఛ...

ప్రస్తుతం ఆమోదం పొందిన ప్రాజెక్టులకు అదనంగా 15 శాతం వరకు అదనపు పనులను చేపట్టే అధికారం రోడ్లు-భవనాల శాఖ మంత్రికి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల మరో రూ.1600 కోట్ల విలువైన రోడ్ల పనులు కూడా చేపట్టేందుకు అవకాశముంది. ఫలితంగా మరిన్ని రోడ్లను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ అదనపు పనులు ప్రధానంగా ప్రాజెక్ట్ కనెక్టివిటీ, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిలు, సేఫ్టీ ఇంప్రూవ్‌మెంట్స్ వంటి అవసరాలకు ఉపయోగపడనున్నాయి. హ్యామ్ మోడల్‌ కింద కాంట్రాక్టర్లు ముందుగా నిర్మాణ వ్యయాన్ని భరిస్తారు, తరువాత ప్రభుత్వం దశల వారీగా చెల్లింపులు చేస్తుంది. దీంతో ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక భారమూ లేకుండా పెద్ద స్థాయి రహదారి అభివృద్ధి సాధ్యమవుతుంది.

Next Story